బైక్స్ దొంగ అరెస్ట్: ట్రయలేస్తనంటడు.. తుర్రుమంటడు

ఓఎల్‌ ఎక్స్‌ లో అమ్మకానికి పెట్టిన బైకులు చూస్తాడు.. ఓ ట్రయలేస్తానంటాడు.. బండెక్కాడా.. ఇక కనబడడు.. ఇలా చోరీలు చేస్తున్న ఓ దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతడి దగ్గర్నుంచి రూ.6.5 లక్షలు విలువైన ఓ కారు, రెండు బైకులు, ఓ ట్యాబ్‌ ను స్వాధీనం చేసు కున్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా నవాపేట్ మండలం కొత్తపల్లికి చెందిన జి. నగేశ్‌ అలియాస్ సు రేందర్ (21 ) ఈజీగా డబ్బులు సంపాదిం చాలనుకున్నాడు. ఓఎల్‌ ఎక్స్‌ లో అమ్మకానికి పెట్టిన వస్తువులైతే సులువుగా దొంగతనం చేయొచ్చనుకున్నాడు. ఓసారి పథకమేశాడు. రాయదుర్గం పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌ పరిధిలో ఓ బైకు అమ్మకానికి పెట్టిన వ్యక్తి దగ్గరకెళ్లి బండి ట్రయల్‌ చూస్తా నని చెప్పాడు. బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుని గాయబ్ అయ్యాడు. షాద్‌ నగర్‌ , రాయదుర్గం , గచ్చి బౌలి ప్రాంతాలను టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకొని మూడు చోరీలు చేశాడు. ఈమధ్య షాద్‌ నగర్‌ నుంచి హైదరబాద్‌ వెళ్లేందుకు ఓ క్యాబ్‌ ను బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాడు. మధ్యలో డ్రైవర్‌ ను సిగరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకురమ్మన్నాడు. అతను కారు దిగి వెళ్లగానే కారుతో ఉడాయించాడు. కారు యజమాని ముస్తఫా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షాద్‌ నగర్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. దొంగిలించిన కారుతో నగేశ్‌ పట్టు బడ్డాడు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించామని డీసీపీ ప్రకాష్‌ రెడ్డి తెలిపారు.

Latest Updates