ఆర్మీ దళపతికి ‘పరమ్ విశిష్ట్ సేవా’ మెడల్

సైన్యంలో ఉత్తమ సేవలను అందించిన వారికి ఈరోజు రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ చేతుల మీదుగా కీర్తిచక్ర, శౌర్యచక్ర, పరమ్ విశిష్ట్ సేవా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కు పరమ్ విశిష్ట్ సేవా అవార్డు వరించింది.  కుప్వారాలోని లైన్ ఆఫ్ కంట్రోల్ సెక్టార్ లో ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చినందుకు మేజర్ తుషార్  కీర్తి చక్రను అందుకున్నారు.ఆర్మీ సిపాయ్ వ్రాహమ్ పాల్ సింగ్, సీఆర్పీఎఫ్ జవాన్లు రాజేంద్ర నైన్, రవీంద్ర బబ్బన్ ధన్వడేలకు మరణానంతరం కీర్తి చక్ర మెడల్స్ ను వారి కుటుంబసభ్యులకు అందించారు. మరో 12 మంది ఆర్మీ జవాన్లకు శౌర్యచక్ర మెడల్స్ ను ప్రధానం చేశారు.

Latest Updates