అమెరికాలో మంచు తుఫాను..విమానాలు రద్దు

అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. రాకీ పర్వతాల నుంచి భారీగా వీస్తున్న చలిగాలుల ధాటికి 25 రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. గంటలకు 148 కిలో మీటర్ల వేగంతో వీస్తున్న ఈ గాలులతో కొలరాడో, నెబ్రస్కా, డకోటాలోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్కూళ్లు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. హిమపాతం కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కొన్ని లక్షల కుటుంబాలు చీకటిలో ఉన్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంచు తుఫానుపై అధికారిక హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా తుఫానును బాంబ్‌ తుఫానుగా వాతావరణశాఖ అధికారులు తెలిపారు. విమనాల రాకపోకలను నిలిపి వేశారు. దీంతో 1,339 విమాన సర్వీసులు రద్దయ్యాయి. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉండడంతో అధికారులు అప్రమత్తమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో హిమపాతంతో పాటు పిడుగులు కూడా పడుతుండటంతో అనేక ఇళ్లు కూలి పోయాయి. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించి ఆస్పత్రికి తరలించారు.

Latest Updates