RRRతో ఇండియాకు పరిచయం అవుతున్న బ్రిటన్ భామ

  • భారతీయ సినిమాకు డైసీ ఎడ్గర్ జోన్స్ పరిచయం
  • సీత పాత్రలో ఆలియా భట్

RRR సినిమాలో ఫిమేల్ లీడ్ పాత్రలో నటించేందుకు బ్రిటన్ కు చెందిన నటిని ఎంపిక చేశాడు దర్శకుడు రాజమౌళి. డైసీ ఎడ్గర్ జోన్స్ అనే బ్రిటీష్ టీవీ, ఫిలిం నటిని ఎంపిక చేశారు. రామరాజు, భీమ్ ప్రధాన పాత్రల్లో చెర్రీ, ఎన్టీఆర్ నటిస్తారు. రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో ఆలియా భట్ ను ఎంపిక చేశారు. డైసీ ఎడ్గర్ జోన్స్ మరో ప్రధాన కథానాయికగా నటించనుంది.

డైసీ ఎడ్గర్ జోన్స్ ఆర్ఆర్ఆర్ సినిమాతోనే భారతీయ సినీ పరిశ్రమకు పరిచయం అవుతోంది. ఈమె 1997లో కోల్డ్ ఫీట్ అనే టీవీ సిరీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పాపులరైంది. ఆ తర్వాత.. వార్ ఆఫ్ వర్డ్స్, 2018లో వచ్చిన పాండ్ లైఫ్ లతో పేరు తెచ్చుకుంది.

 

Latest Updates