సిలిండర్ పేలి.. ఇద్దరికి గాయాలు..కారు అద్దాలు ధ్వంసం

ద్విచక్రవాహనంపై సోడా బండి కోసం ఉపయోగించే సిలిండర్​ తీసుకెళ్తుంటే పేలిన ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, కారు అద్దాలు ధ్వంసమైన ఘటన కేపీహెచ్​బీ కాలనీ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం హైటెక్​సిటీ నుండి అనిల్​(19), హర్షిత్​(12) ద్విచక్ర వాహనంపై  సిలిండర్​ను తరలిస్తున్నారు. జేఎన్​టీయూ ఫ్లైఓవర్ ​మంజీరా మాల్ ​వద్దకు చేరుకోగానే సిలిండర్​జారి కిందపడి పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి అదే రూట్లో వస్తున్న కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కారు యజమానికి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్​ఐ నర్సింహులు చెప్పారు.

Latest Updates