స్మార్ట్ ఫోన్ల కోసం ఫైర్ ఫాక్స్ లైట్

ఇంటర్నెట్ వెబ్ బ్రౌజర్ మొజిల్లా ‘ఫైర్ ఫాక్స్​లైట్’ వెర్షన్ ను రిలీజ్ చేసింది. మనదేశంతో పాటు పలు ఆసియా దేశాల్లో కొత్త వెబ్ బ్రౌజర్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లే లక్ష్యంగా, తక్కువ డాటా వినియోగించుకునేలా కొత్త వెర్షన్ రూపొందింది. ఇది 4 ఎంబీ స్పేస్ కెపాసిటీ మాత్రమే కలిగి ఉంది. అంటే ఇతర బ్రౌజర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఫ్యూచర్ అప్ డేట్స్​ కూడా తక్కువ స్పేస్ తోనే ఉంటాయి. గూగుల్ క్రోమ్ తో పోలిస్తే తక్కువ డాటాతోనే వెబ్ పేజీలు బ్రౌజ్ చేయొచ్చని మొజిల్లా తెలిపింది. ప్రైవసీకి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొంది. థర్డ్ పార్టీ ట్రాకర్స్ బ్రౌజింగ్ మధ్యలోకి రాకుండా బ్లాక్ చేస్తుంది. దీంతోపాటు నైట్ మోడ్, బ్లాకింగ్, సేవ్ ఆఫ్ లైన్ వంటి ఫీచర్లున్నాయి.

Latest Updates