కారు అడిగితే..నాన్న చెప్పుతో కొడతా అన్నారు

అల్లు శిరీష్ హీరోగా ‘ABCD’ సినిమాలో నటిస్తున్నాడు. ఇది మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ABCD’ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సోమవారం రాత్రి ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇందులో భాగంగా ఆసక్తి కర  విషయాలను అన అభిమానులతో పంచుకున్నారు.

‘ఈ సినిమా మలయాళంలో చూసినప్పుడు నా పర్సనల్ లైఫ్ స్టోరీలా అనిపించింది. హీరో, అతని తండ్రి పాత్రలు చూసినప్పుడు వీటితో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది అనిపించింది. మా నాన్నగారు కూడా గుర్తొచ్చారు. ఎందుకంత పర్సనల్‌గా కనెక్ట్ అయ్యానంటే.. ఈ సినిమాలో ఎలాంటి లక్ష్యంగా లేకుండా, డబ్బు విలువ తెలియకుండా అల్లరి చిల్లరగా తిరిగే కొడుకును మార్చడానికి తండ్రి తపన పడుతూ ఉంటాడు. నేను కాలేజ్ టైమ్‌లో ఉన్నప్పుడు మా నాన్న పడే తపన నాకు గుర్తుకొచ్చింది’ అని చెప్పాడు.

‘నాకు 21 ఏళ్లు వచ్చినప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్లాను. డాడీ.. బన్నీకి, చరణ్‌కు 21 ఏళ్లు వచ్చినప్పుడు కార్లు కొనిచ్చావ్, ఇప్పుడు నాకు 21 ఏళ్లు వచ్చాయి ఒక కారు కావాలి అని అడిగాను. ఏం కారు కావాలి అని నాన్న అడిగారు. నాకు మస్టాంగ్ జీటీ స్పోర్ట్స్ కార్ కావాలి అని అడిగాను. వెంటనే చెప్పుతో కొడతానన్నారు. నీ వయసు కుర్రోళ్లు బస్సుల్లో,ఆటోల్లో జర్నీ చేస్తూనో… టూ వీలర్స్‌పై తిరుగూ జాబ్ చేసుకుంటున్నారు. నీకు కార్ కొనివ్వడమే ఒక లగ్జరీ. అలాంటిది నువ్వు స్పోర్ట్స్ కార్ అడుగుతున్నావ్. అసలు నీకు డబ్బు విలువ తెలుస్తోందా అని అడిగారు.

ఈ ఫాదర్లంతా ఇంతే ఏదడిగినా ఏదో లెక్చర్ పీకుతారు అనుకున్నాను. అలిగాను. దీంతో మా నాన్న ఒక కారు కొనిస్తానన్నారు. కొంత బడ్జెట్ చెప్పారు. నేను ఇగోకి పోయి నాకేమీ వద్దు నేనే కొనుక్కుంటా అని సవాల్ విసిరాను. అయితే నేనుగా కారు కొనుక్కోవడానికి మూడేళ్లు పట్టింది. అప్పటికీ నేను మస్టాంగ్ జీటీ కొనుక్కోలేకపోయాను. నేను సంపాదించిన డబ్బుతో మిత్సుబిసి ఔట్‌ లాండర్ కొనుక్కోగలిగాను. ఒకవేళ నేను ఆ రోజు అడిగినప్పుడు మా నాన్న ఆ కారు కొనిచ్చుంటే నాకు నిజంగా డబ్బు విలువ తెలియకపోయేది’ అని చెప్పుకొచ్చాడు శిరీష్.

Latest Updates