కన్నవారికి భారం కాకూడదని ఇంటర్ విద్యార్థిని సూసైడ్

హైదరాబాద్ : తల్లిదండ్రులకు భారం కాకూడదని ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన శనివారం హైదరాబాద్ లో జరిగింది. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండిరా నెహ్రు నగర్లో మందుల మానస (18) నివాసం. మల్కాజిగిరిలోని సెయింట్ ఆన్స్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇటీవలే పరీక్షలు కూడా రాసింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో.. తాను కన్నవారికి భారం కాకూడదనే ఉద్దేశ్యంతో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates