KGF చాప్టర్ 2 షూటింగ్ స్టార్ట్ : 2020 సమ్మర్ లో రిలీజ్

సంచలన విజయం సాధించిన KGF సినిమాకు సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైంది. KGF చాప్టర్ 2 పేరుతో రూపొందుతున్న ఈ సినిమా మూహూర్తపు షాట్ ను హీరో యశ్, హీరోయిన్ పై చిత్రీకరించారు. బెంగళూరు.. విజయానగర్ లోని కోదండరామ గుడిలోపూజ తర్వాత షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభించింది సినిమా యూనిట్.

చాప్టర్ 1తో పోల్చితే మరిన్ని ఆకర్షణలు ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. సినిమా రేంజ్ ను పెంచేందుకు బాలీవుడ్ బిగ్ షాట్ సంజయ్ దత్ ను ఓ పాత్ర కోసం మూవీ యూనిట్ సంప్రదించినట్టు చెబుతున్నారు.

“దేవుడి ఆశీస్సులు, అభిమానుల ప్రేమ, మద్దతుతో కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ ప్రారంభిస్తున్నాం. ఈ సీక్వెల్ తో డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాం. దీనికి ఎప్పటిలాగే మీ అందరి సపోర్ట్ కావాలి” అని హీరో యశ్ ట్వీట్ చేశాడు.

హొంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్, కార్తీక్ గౌడ నిర్మిస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తన్నాడు. శ్రీనిధి షెట్టి కథానాయిక. 2020 సమ్మర్ లో సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Latest Updates