పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమజంట సూసైడ్

ఒడిశా : ఒకరికొకరు సిన్సియర్ గా ప్రేమించుకున్నారు. కలిసి జీవితం పంచుకోవాలనుకున్నారు. కానీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో కలిసి చనిపోయారు. ఈ సంఘటన ఒడిశాలో జరిగింది.

నవరంగపూర్‌ జిల్లా జోరిగాం సమితి ఖెమరా గ్రామానికి చెందిన సునాఘడ్‌ జాని(21), కుమారి జాని(20)లు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వ్యవహారం తెలిసిన పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. పెళ్లికి అంగీకరించకపోవడంతో.. మనస్థాపానికి చెందిన ప్రేమికులు గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Latest Updates