అత్తను దారుణంగా చంపిన అల్లుడు

man-killed-his-motherinlaw-in-bhupalapalli-dist

భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది.  అల్లుడి చేతిలో అత్త దారుణ హత్యకు గురైంది. జిల్లాలోని రేగొండ మండలం  చెన్నాపూర్‌ గ్రామంలో జరిగిందీ ఘటన. ఒన్నాల లక్ష్మీ అనే వృద్ధురాలిని, ఆమె కూతురిని అల్లుడు గొడ్డలితో నరికాడు. ఈ దాడిలో అత్త మృతి చెందగా కూతురు సుజాత తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు ప్రభాకర్ కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates