ఈ పెయింటింగ్​.. జస్ట్​ 778 కోట్ల రూపాయలంతే!

నమ్మాలనిపించట్లేదా..? నమ్మి తీరాల్సిందే. అరె, గడ్డితప్ప ఏముందని దాంట్ల అన్ని పైసలు పెట్టాలె? అంటరా! క్లాడ్​ మోనెట్​ అనే పెయింటర్​ వేశాడట ఈ పెయింటింగ్​. అతడు చాలా ఫేమస్​ అట. ఫ్రాన్స్​ సొంత దేశం. అతడి పెయింటింగ్​స్​ కొన్ని మాత్రమే ప్రైవేట్​ వ్యక్తుల దగ్గర ఉన్నాయట. మంగళవారం న్యూయార్క్​లోని సోథెబీ వేలం సంస్థ దానిని వేలం వేసింది. దానిని పాడుకున్న ఆ మహానుభావుడు ఎవరో తెల్వదుగానీ, 11 కోట్ల డాలర్లు పెట్టేసిండు. మన పైసలల్ల చెప్పాలంటే 778 కోట్ల రూపాయల పైమాటే. ఈ పెయింటింగ్​ను ఫ్రాన్స్​లోని గివర్నీలో తన ఇంట్లో గీశాడట. అదీ 1890–1891 మధ్య తన ‘ఇంప్రెషనిస్ట్​ ఆర్ట్​’ను ఇలా చూపించాడట. ఇగ, ఈ పెయింటింగ్​ పేరు మ్యూల్స్​ అంట. ఆ సిరీస్​లో 25 పెయింటింగ్స్ వేస్తే, అందులో ఒకటి ఇది. తన పక్కింటి వ్యక్తి పండించిన పంటను ఒకదగ్గర కుప్ప పెడ్డాట. ఆ కుప్పనే ఇట్ల మ్యూల్స్​గా మార్చాడన్నమాట. 1926ల 86 ఏళ్ల వయసులో మోనెట్  చనిపోయాడు. వేలంలో 10 కోట్ల డాలర్ల మార్కు దాటిన ఇంప్రెషనిస్ట్​ ఆర్ట్​ ఇదేనట. మరి, నెటిజన్లు ఊరుకుంటరా. రెచ్చిపోయిండ్రు. ఏముందిరా బాబు దాంట్ల అంతగనం పైసలు కుమ్మరియ్యడానికి అంటూ ట్వీట్లు చేసేశారు.