దుబాయ్‌ సెంటు.. అదిరింది రేటు

బాడీ పర్ఫ్యూమ్‌ రేటు ఎంతుంటుంది? బాగా ఖరీదైనదైతే ఓ లక్షో, రెండు లక్షలో ఉంటుంది. కానీ ఈ సెంటు అట్లాంటి ఇట్లాంటిది కాదండోయ్‌. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైంది మరి. రేటు రూ. 8.9 కోట్లు. ది స్పిరిట్‌ ఆఫ్‌ దుబయ్‌ పర్ఫ్యూమ్స్‌ సంస్థ విడుదల చేసింది. పేరు షుముఖ్‌.. అంటే ‘డిజర్వింగ్‌ ది హయ్యెస్ట్‌ ’అని అర్థం. ఎందుకింత రేటు? అంటే వజ్రాలు, బంగారంతో బాటిల్‌ ను డిజైన్‌ చేశారు మరి. 3,571 వజ్రాలు, 2479 గ్రాముల బంగారం, 5892 గ్రాముల వెండి సహా విలువైన రాళ్లు, ముత్యాలతో అందంగా తీర్చిదిద్దారు. బాటిల్‌ పొడవు1.97 మీటర్లు. సెంటునూ ప్రపంచంలో అత్యుత్తమైన ఏడు పదార్థాలతో తయారు చేశారు. అంబర్‌, గంధం, కస్తూరి, స్వచ్ఛమైన ఇండియన్‌ అగార్‌ వుడ్‌ , టర్కిష్‌ గులాబీ, ప్యాచౌలీ య్లాంగ్‌ య్లాంగ్‌, సాంబ్రాణిలతో గుర్తుండిపోయేలా సిద్ధం చేశారు. సువాసనల ప్రపంచంలో దుబాయ్‌ ను గుర్తు చేసుకునేలా, అత్యంత గొప్పదైన, విభిన్నమైన ఆ దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా రెడీ చేశారు. సుముఖ్‌ ను చూడాలంలే దుబాయ్‌మాల్‌ కు వెళ్లాలి మరి.

చర్మంపై 12 గంటల పాటు
చర్మంపైన చల్లుకుంటే 12 గంటలు, ఫ్యాబ్రిక్‌ పైన వేసుకుంటే 30 రోజుల వరకు షుముఖ్‌ సువాసన ఉంటుంది. పర్ఫ్యూమ్‌ కు రిమోట్‌ కంట్రోల్‌ స్ప్రే మెషీన్‌ ను సెట్‌ చేశారు. మనుషుల ఎత్తుకు తగ్గట్టు అది సెట్‌ అయిపోతుంది. నబీల్‌ గ్రూఫ్‌ ఆఫ్‌ కంపెనీస్‌‌ చైర్మన్‌ , మాస్టర్‌ పర్ఫ్యూమర్‌ అష్గర్‌ ఆడమ్‌ అలీ దీన్ని తయారు చేశారు. స్విడ్జర్లాండ్‌, ఫ్రాన్స్‌, ఇటలీకి చెందిన ప్రముఖ శిల్పులు బాటిల్‌ ను సిద్ధం చేశారు. షిముఖ్‌ గిన్నిస్‌‌ వరల్డ్‌ రికార్డు కూడా సంపాదించిందండోయ్‌ . ‘మోస్ట్‌ డైమండ్స్‌ సెట్‌ ఆన్‌ ఎ పర్ఫ్యూమ్‌ ’, ‘టాలెస్ట్‌ రిమోట్‌ కంట్రోల్డ్‌ ఫ్రాగ్రెన్స్‌ స్ప్రే ప్రాడక్ట్‌ ’గా రికార్డుకెక్కింది.

Latest Updates