మార్కెట్లోకి స్మార్ట్ వాచ్ : గుండె వేగాన్ని చెబుతుంది

ముంబై: తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు చైనాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెలికమ్యూనికేషన్ సంస్థ హువేయి మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ ని విడుదల చేయనుంది. మార్చి 12వ తేదీన భారత మార్కెట్‌ లో హువేయి వాచ్ జీటీని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది కంపెనీ. అమెజాన్ ఇండియా ద్వారా వినియోగదారులు కొత్త స్మార్ట్‌వాచ్‌ ని కొనుగోలు చేయవచ్చని తెలిపింది. 50 మీటర్ల లోతు ఉన్న వాటర్‌ లో పడినా.. హువేయి వాచ్ జీటీ పని చేస్తోందని సంస్థ తెలిపింది. ఈ వాచ్ గుండె వేగాన్ని కూడా తెలుపుతుందని చెప్పింది.

 

 

Latest Updates