షావోమి నుంచి స్మార్ట్​ఫోన్​ వెండింగ్​ మెషిన్లు

మెట్రో నగరాల్లో వెండింగ్​ మెషిన్లు కామన్​ అయిపోయాయి. కూల్​డ్రింక్స్, బొమ్మలు, ఐస్​క్రీమ్స్.. ఇలా ఒకటేమిటి అనేక రకాల ఉత్పత్తులు వెండింగ్​ మెషిన్లలో దొరుకుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి స్మార్ట్​ఫోన్లు కూడా చేరనున్నాయి. చైనీస్​ స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​ ‘షావోమి’ మన దేశంలో స్మార్ట్​ఫోన్​ వెండింగ్​ మెషిన్లను ఏర్పాటు చేయబోతోంది. ఒక మొబైల్​ సంస్థ ఇలా వెండింగ్​ మెషిన్లను ఏర్పాటు చేయనుండటం దేశంలో ఇదే తొలిసారి. ‘ఎమ్​ఐ ఎక్స్​ప్రెస్  కియోస్క్’​గా పిలిచే స్మార్ట్​ఫోన్​ వెండింగ్​ మెషిన్లను షావోమి పలు ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేయనుంది. మెట్రో స్టేషన్లు, టెక్​పార్కులు, ఎయిర్​పోర్టులు, షాపింగ్​ మాల్స్​లలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఎమ్​ఐ ఫోన్లు ఎక్కువగా ఆన్​లైన్​లోనే దొరుకుతుంటాయి. అయితే ఆఫ్​లైన్​మార్కెట్​ను కూడా విస్తరించే చర్యల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తోంది. వినియోగదారులు క్యాష్, క్రెడిట్, డెబిట్​ కార్డులు, యూపీఐ విధానంలో డబ్బులు చెల్లించి నచ్చిన షావోమి మొబైల్​ ఫోన్లు, యాక్సెసరీలు కొనుగోలు చేయొచ్చు.