
కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్దార్ 2’. మూడేళ్ల క్రితం ‘సర్దార్’గా సక్సెస్ అందుకోగా, ఇప్పుడు సర్దార్ సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని మేకర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా టీమ్ అందరూ సెట్‌లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలని షేర్ చేసిన కార్తి..‘షూటింగ్ పూర్తవడం ఇదొక సాహసం’ అని పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా, ఎస్ జె సూర్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.