అంగారకుడిపై గాలి వినబడింది.. సౌండ్ రికార్డ్ చేసిన ఇన్ సైట్ ల్యాండర్

అరుణ గ్రహం- మార్స్ పై గాలి ఉంది. బలమైన గాలి సౌండ్ రికార్డ్ కూడా అయింది. అంగారకుడిపై పరిశోధనల్లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా మరో కీలకమైన మైలురాయి చేరుకుంది. కుజ గ్రహంపైకి నాసా పంపిన ఇన్ సైట్ ల్యాండర్ ఉపగ్రహం గత నెల చివరి వారంలో(నవంబర్ 26న) ఆ గ్రహంపై దిగింది. అప్పుడే అక్కడినుంచి డేటాను పంపడం ప్రారంభించింది. అంగారక గ్రహంపై దిగిన ఇన్ సైట్ ల్యాండర్.. అక్కడి భూభాగానికి సంబంధించిన ఫొటోలను కూడా పంపుతోందని నాసా తెలిపింది. ఓ ఫొటోను విడుదల చేసింది.

ఇన్ సైట్ ల్యాండర్ సోలార్ శాటిలైట్… అంగారక గ్రహంపై ఉన్న గాలి శబ్దాలను రికార్డ్ చేసి పంపిందని నాసా తెలిపింది. అంగారకుడిపై గాలి ఉందన్న సంగతి తెలిసినా.. దానికి రుజువులు పంపడం.. గాలి శబ్దాలు రికార్డ్ చేసి పంపడం ఇదే మొదటిసారి అని నాసా చెబుతోంది. ఇన్‌సైట్‌ సోలార్‌ప్యానెల్స్‌ మీదుగా గంటకు 10 నుంచి 15 మైళ్ల వేగంతో గాలులు వీచాయని తెలిపింది.  స్పేస్‌క్రాఫ్ట్‌లోని రెండు సెన్సార్లు ఈ గాలి శబ్దాల తరంగాలను రికార్డ్ చేశాయి. ఇన్‌సైట్‌ ల్యాండర్ కు అమర్చిన విండ్ ప్రెషర్ సెన్సార్, సెస్మోమీటర్‌ సెన్సార్ లతో ఇది సాధ్యమైందని నాసా తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates