అంగారకుడిపై భారీ సరస్సు : ఊపందుకున్న పరిశోధనలు

అంగారకుడిపై తొలిసారిగా ద్రవరూపంలో నీరున్న భారీ సరస్సు బయటపడింది. మంచుపొర కింద  20 కి.మీ. ప్రాంత పరిధిలో ఇది విస్తరించివుంది. దీంతో మరింత నీరుతోపాటు అక్కడ జీవమూ ఉండే అవకాశముందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం అంగారక ఉపరితలం అత్యల్ప ఉష్ణోగ్రతలతో పొడిపొడిగా ఉంది. 360 కోట్ల ఏళ్లక్రితం ఇక్కడ భారీ సరస్సులు ఉండేవనిచెప్పే ఆనవాళ్లు ఇప్పటికే బయటడ్డాయి.  ప్రస్తుతం ద్రవరూపంలోని నీటి జాడలను పరిశీలించేందుకు ఇటలీలోని ఇస్టిట్యూటో నేజియోనల్‌ డీ అస్ట్రోఫిజికా సంస్థ నిపుణులు లేటెస్ట్ గా అన్వేషణ చేపట్టారు. ఐరోపా అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన మార్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆర్బిటార్‌ లోని రాడార్‌ సమాచారాన్ని వీరు విశ్లేషించారు.

మార్సిస్‌ గా పిలుస్తున్న ఈ రాడార్‌.. అంగారక ఉపరితలంపై రేడియో తరంగాలను పంపుతుంది. ఇవి మంచు పొరల్లోకి చొచ్చుకెళ్లి అంతర్భాగంలోని పరిస్థితుల సమాచారాన్ని చేరవేస్తాయి. దక్షిణార్ధగోళంలోని ప్లానుమ్‌ ఆస్ట్రేల్‌ ప్రాంతంలో మే 2012 నుంచి డిసెంబరు 2015 మధ్య రాడార్‌ సేకరించిన సమాచారాన్ని ప్రస్తుతం పరిశోధకులు విశ్లేషించారు. మొత్తంగా 29 నమూనాలపై దృష్టిసారించారు. ఇక్కడి రాడార్‌ సంకేతాల్లో చాలా తేడా కనిపిస్తోంది. భూమిపై గ్రీన్‌ లాండ్‌, అంటార్కిటికాల్లోని మంచు ఫలకాల కింద నీరును తెలియచేసే తరహా సంకేతాలు ఇక్కడ నుంచి వస్తున్నాయి. అంటే ఇక్కడ సరస్సు ఉందన్నమాట. గడ్డకట్టిన ఉపరితలానికి 1.5 కి.మీ దిగువన అని తెలిపారు పరిశోధనకు నేతృత్వం వహించిన రాబర్టో ఒరోసెయ్‌.

Posted in Uncategorized

Latest Updates