అంజన్ కుమార్ యాదవ్ అరెస్టు

హైదరాబాద్  రోడ్లు  అధ్వాన్నంగా  మారాయని  సిటీ  కాంగ్రెస్  అధ్యక్షులు  అంజన్ కుమార్ యాదవ్  మండిపడ్డారు.  రోడ్ల  దుస్థితిపై  GHMC  కార్యాలయం  ముందు  నిరసన తెలిపేందుకు  సిద్ధమైన కాంగ్రెస్ శ్రేణులను  పోలీసులు  అరెస్ట్ చేశారు.  ఎమ్మెల్యే  క్వార్టర్స్ నుంచి  ర్యాలీగా వెళ్లేందుకు  ప్రయత్నించిన  వారిని అదుపులోకి  తీసుకున్నారు  పోలీసులు. విశ్వనగరం  చేస్తామంటూ  కేటీఆర్ చేసిన  ప్రకటనలన్నీ… కాగితాలకే పరిమితమయ్యాయని  అంజన్ కుమార్  యాదవ్  విమర్శించారు.

Posted in Uncategorized

Latest Updates