అంజయ్యను అవమానించింది కాంగ్రెస్: లోక్ సభలో మోడీ

modiఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా  టంగుటూరి అంజయ్య ఉన్నప్పడు ఓ సారి అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హైదరాబాద్ వచ్చారన్నారు ప్రధాని మోడీ. రాజీవ్ గాంధీని రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్ పోర్ట్ కు వెళ్లినప్పుడు ఓ దళిత ముఖ్యమంత్రి అని అంజయ్యను అవమానించింది కాంగ్రెస్ అంటూ మోడీ లోక్ సభలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. తెలుగువారైన నీలం సంజీవరెడ్డిని, పీవి నరసింహరావుని కాంగ్రెస్ తీవ్రంగా అవమానంచింది కాంగ్రెస్ కాదా అంటూ మోడీ నిప్పులు చెరిగారు. తెలుగువారి ఆత్మాభిమానాన్ని కాంగ్రెస్ దెబ్బతీయడంతోనే నటుడిగా ఉన్న ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీ స్ధాపించి కాంగ్రెస్ పై తిరుగులేని విజయం సాధించారన్నారు ప్రధాని మోడి.

Posted in Uncategorized

Latest Updates