అండర్-19లో అర్జున్ : సచిన్ పేరు నిలబెట్టాలి

ARJUNమాస్టర్ బ్లాస్టర్ సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ అండర్-19 టీమ్ కు సెలక్ట్ కావడంతో సంతోషం వ్యక్తం చేశారు సచిన్. తాను క్రికెట్ కు దూరమైన కొద్దిరోజులకే తన కొడుకు క్రికెట్ లోకి అడుగుపెడుతుండటం చాలా గౌరవంగా ఉందన్నారు. అర్జున్ క్రికెట్ జీవితంలో ఇదొక మైల్డ్ స్టోన్ అన్నారు.

కొడుకు క్రికెటర్ గా రాణించేందుకు తన భార్య అంజలి బాగా ప్రొత్సహిస్తుందని చెప్పిన సచిన్..అర్జున్ తన పేరు నిలబెట్టాలని ఆశిస్తున్నానన్నారు. అర్జున్ అండర్ -19కి సెలక్ట్ కావడంతో సోషల్ మీడియాలో సచిన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సచిన్ పేరు నిలబెట్టాలంటున్నారు. ఆల్ ద బెస్ట్ జూనియర్ సచిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే IPL  చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా అర్జున్‌ ఎంపిక పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ అతన్ని అభినందించారు. టోర్నీల్లో అద్భుతంగా రాణించాలని ఆకాక్షించారు.

క్రికెట్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ లో అన్ని ఫార్మాట్ లో రాణించిన అర్జున్‌.. మొదటిసారి టీమిండియా బ్లూ జెర్సీలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. శ్రీలంకలో పర్యటించే భారత అండర్‌–19 టీమ్ లోకి సెలక్ట్  అయ్యాడు. జూలై 11 నుంచి ఆగస్టు 11 వరకు ఈ జూనియర్‌ టీమ్ లంకతో 2  టీ20,  ఐదు వన్డే మ్యాచుల్ని ఆడనుంది. అయితే నాలుగు రోజుల టోర్నీకే ఎంపికైన అర్జున్‌ కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. ఈ లిటిల్‌ టెండూల్కర్‌ లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్‌ జాతీయ అండర్‌–19 టోర్నీ కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో  ముంబై తరఫున 18 వికెట్లతో రాణించాడు. దీంతో అతని ప్రదర్శన భారత జట్టులోకి ఎంపికయ్యేలా చేసిందని చెప్పారు సెలక్టర్లు.

Posted in Uncategorized

Latest Updates