అంతటా ఎగతాళే : అందంగా లేనని యువకుడు సూసైడ్

sucideఆ యువకుడికి ఉద్యోగం కోసం ఎక్కడికెళ్లినా ఆటంకమే. సమాజంలోనూ నల్లోడనే ఎగతాళి. ఫ్రెండ్స్, బంధువులు.. నల్లగా ఉన్నాడని పక్కకు పెట్టారు. దీంతో అందంగా లేననే బాధ ఓవైపు, ఎక్కడికెళ్లినా పని లభించకపోవడం, ఆర్థిక సమస్యలతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేతిపై అందమైన అక్షరాలతో  తన చావుకు తాను అందంగా లేకపోవడమే కారణం అని తెలిపాడు.

విజయనగరం జిల్లా బొబ్బిలి రైల్వేస్టేషన్‌ సమీపంలో శుక్రవారం (జూన్-1 )అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. సాలూరు మండలం కోదుకరకవలసకు చెందిన మారోజు ధనుంజయ(25) మృతదేహం రైలుపట్టాలపై పడి ఉంది. తన చావుకు గల కారణాలు చేతిపై రాసుకోవడంతో పాటు సోదరుడు పరమేశ్వరరావుకు మొబైల్ లో మెసేజ్ పంపాడు. సోదరుడు  స్టేషన్‌ కు వచ్చేసరికి ధనుంజయ మృతి చెందాడు. మృతుడు ITI, ఇంటర్‌ పూర్తిచేసి డిస్టెన్స్ లో డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవల గ్రామంలో పెళ్లి సంబంధం కోసం బంధువుల ఇంటికి వెళ్లగా ..నీ ముఖం అద్దంలో చూసుకుంటే బాగుంటుంది అని పలువురు ఎగతాళి చేసినట్లుగా తెలుస్తోంది. దీంతోపాటు ఏ దుకాణంలోకి వెళ్లినా ఉపాధి అవకాశాలు ఇవ్వకపోవడంతో తనలో తాను బాధపడేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే బలవన్మరణం పొంది ఉంటాడని భావిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates