అంతర్జాతీయ యోగా దినోత్సవం: ఆసనాలతో ఆరోగ్యం

yoga-dayశాంతికోసం యోగా థీమ్ తో ప్రపంచమంతా నాలుగో యోగా దినోత్సవాన్ని జరుపుతోంది కేంద్రప్రభుత్వం. మనదేశంలో దాదాపు ఐదువేల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 150కి పైగా దేశాల్లో భారత ఎంబసీ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ .. డెహ్రాడూన్ లో 55వేల మందితో కలిసి ప్రదానమంత్రి నరేంద్రమోడీ ఆసనాలు వేస్తున్నారు. సురినామ్ దేశంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ యోగా డేలో పాల్గొంటారు. బ్రసెల్స్ లో సుష్మ స్వరాజ్, ముంబైలో ఉపరాష్ట్పతి వెంకయ్య, లక్నోలో రాజ్ నాథ్ సింగ్, సియాచిన్ లో సద్గురు జగ్గీ వాసుదేవ్ పాల్గొంటారు. ఢిల్లీలో 8చోట్ల యోగా డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యానికి యోగా పాస్ పోర్ట్ లాంటిదని ప్రధాని మోడీ ప్రజలను ఉత్సాహపరిచారు. యోగాను మతంతో ముడిపెట్టవద్దని.. ఇది అందరికీ సంబంధించినదే అని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ చెబుతోంది.

నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయ్యాక.. యోగా డే ను ఘనంగా నిర్వహిస్తున్నారు.  మనదేశంలోనే కాదు… ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహన్నారు. ఉత్తరార్ద గోళంలో అత్యంత సుదీర్ఘమైన రోజుగా భావించే జూన్ 21నన యోగా డే నిర్వహించాలని ప్రధాని మోడీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రతిపాదించారు. ఈ తేదీని యూఎన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. అప్పటినుంచి ప్రపంచమంతా భారతీయ యోగాకు ప్రచారం కల్పిస్తూ ఘనంగా యోగా డే నిర్వహించడం జరుగుతోంది.

ఉరుకులు, పరుగుల జీవితం… ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన.. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు.. ముంచుకొస్తున్న వ్యాధులు, కొత్త కొత్త రోగాలు మనుషులను మరింత కుంగదీస్తున్నాయి. వీటన్నింటికీ దివ్యఔషదంగా పనిచేస్తోంది యోగా. వందల ఏళ్ల నుంచి మన దేశంలో ఆచరిస్తున్న యోగాతో ప్రయోజనాలు మిన్న అంటున్నారు మానసిక నిపుణులు. విద్యార్ధులు, ఉద్యోగులు, మహిళలు, వృద్దులు, చిన్నారులనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగా చేస్తే… మానసిక ఆందోళన తగ్గి.. చేసే పనిపై దృష్టి పెరుగుతుందని చెబుతున్నారు.

రక్త పోటును నియంత్రించడం… గ్యాస్టిక్ సమస్యలు.. అజీర్తి, ఒత్తిడి సమస్యలను బయటపడటమే కాదు.. ఆసనాలతో.. శరీరంలోని అనవసర కొవ్వును కూడా తగ్గించుకోవచ్చు. తగిన పద్దతుల్లో యోగా చేస్తూ ఆరోగ్యనియమాలు పాటిస్తే.. ఆరోగ్యానికి మేలుచేస్తుందంటున్నారు డాక్టర్లు. ఆసనాలతో ఆరోగ్య యోగం పడుతుందని అంటున్నారు.

యోగాలో మొత్తం 43 వేల ఆసనాలకు పైగా ఉండగా.. వాటిలో ప్రధానంగా 25 మాత్రం నిత్యం ఉపయోగకరంగా ఉంటాయంటున్నారు యోగా ట్రైనర్స్.  క్రానికల్ డిసీజెస్ అయిన.. బీపి, షుగర్, ఆస్తమా, బ్యాక్ పెయిన్స్, కీళ్లనొప్పులు లాంటి సమస్యలకు యోగాతో పరిష్కారం లభిస్తుందంటున్నారు ఎక్స్ పర్ట్స్.

పంతాలు,  పట్టింపులు, పగలు,  ప్రతీకారాలు… అన్నీ మనుషుల్లో  భావోద్వేగాలను రెచ్చగొట్టేవే. ఇలాంటివాటిని  కంట్రోల్ చేయడానికి యోగానే మంచి మందు. మతాలకు,  కులాలకు, ప్రాంతాలకు, దేశాలకు సంబంధం లేకుండా.. అందరినీ ఆకర్షిస్తోంది యోగా.  భారతీయ జీవన విధానంలో భాగంగా  ఉన్న యోగా మీద … ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. యోగాతో ఏకాగ్రత పెరగడం.. ఆసనంతో ఆరోగ్యయోగం పట్టడం దీని ప్రత్యేక. అందుకే.. యోగాపై జనాలకు ఆసక్తి పెరిగిపోతోంది.

Posted in Uncategorized

Latest Updates