అంతా ఆన్ లైన్ : టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదల

kadiyamటీచర్స్ బదిలీల వెబ్ సైట్ ను ప్రారంభించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. అన్ని వివరాలు వెబ్ సైట్ లో ఉంచామని చెప్పారు. KGBV స్కూల్ టీచర్లను బదిలీ చేయడానికి అవకాశం లేదన్నారు. మోడల్ స్కూల్ టీచర్లను ఆగస్ట్ లేదా దసరా సెలవుల్లో బదిలీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు కడియం. 7 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు హెల్త్‌ కిట్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఉపాధ్యాయ నిమామకాలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారని.. నిర్ణయం తీసుకోగానే కాంగ్రెస్ వారే కోర్టులో కేసులు వేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు చిల్లరగా వ్యవహరిస్తున్నారని చెప్పిన కడియం.. అసహనంతో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకున్నామని. ఆ వివరాలు కోర్టుకు అందజేశామని తెలిపారు. ఫీజులు నియంత్రించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు.

విద్యార్థినుల ఆరోగ్యానికి అవసరమైన కొత్త మెనూను ప్రారంభిస్తున్నామని తెలిపిన ఆయన.. అన్ని KGBV ల్లోనూ ఒకే రకమైన మెనూను అందిస్తామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు  చెప్పారు. విద్యార్థినుల అవసరాలకు అనుగుణంగా ఆరోగ్య కిట్లు ఇవ్వాలని నిర్ణయించామని.. ఆరోగ్య కిట్లు అందించేందుకు అవసరమైన రూ.100కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు మంత్రి కడియం.

Posted in Uncategorized

Latest Updates