అంతా ఒక్కటే : అక్కడి విద్యార్థులకు కులం, మతం లేదు

kerala-students-CASTరోజు ఏదో ఒక చోట కులం, మతం పేరిట గొడవ పడే ఈ రోజుల్లో కేరళ విద్యార్థులు మాత్రం కుల, మత, రహిత సమాజం వైపు తొలి అడుగు వేశారు. బుధవారం ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఈ విషయాలను వెల్లడించారు. బుధవారం (మార్చి-28) అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్‌ అవర్‌లో తెలిపారు మంత్రి సి రవీంద్రనాథ్‌.

2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి.. ఇప్పటి వరకూ కేరళ వ్యాప్తంగా 1.24 లక్షల మంది విద్యార్థులు తాము ఏ కులానికి, మతానికి చెందమని చెప్పినట్లు మంత్రి తెలిపారు. ఒకటో తరగతి నుంచి 10 తరగతి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 9వేల పాఠశాలల్లో సేకరించిన సమాచారం ప్రకారం పాఠశాల అడ్మిషన్లలో 1 లక్షా 23 వేల 630 మంది కులం, మతం పేరును నింపలేదని తెలిపారు మంత్రి. అంతేకాకుండా ఇంటర్మీడియట్‌ చదువుతున్న వారిలో మొదటి సంవత్సరంలో 278 మంది, ద్వితీయ సంవత్సరంలో 239 మంది తాము ఏకులానికి మతానికి చెందిన వారిమి కాదంటూ తమ అడ్మిషన్లలో చేర్చినట్లు చెప్పారు.

 

 

Posted in Uncategorized

Latest Updates