అంతా కుర్రోళ్లే : క్రికెట్ అభిమానులు 100 కోట్లు

cricket fansక్రికెట్.. క్రికెట్.. క్రికెట్.. ఈ మాట వింటే చాలు భారతదేశం ఊగిపోతోంది. మ్యాచ్ జరుగుతుంటే కళ్లప్పగించి చూస్తారు. ఇష్టమైన ఆటగాడు కనిపిస్తే పండుగే.. ఆటోగ్రాఫ్ కోసం ఎగబడిపోతాం.. బస్సు వెనక, కార్ల వెనక పరిగెడతాం.. దగ్గర నుంచి చూసి తన్మయత్వం అవుతాం.. గల్లీ గల్లీలో క్రికెట్ అప్రతిహాసంగా సాగిపోతోంది.. జూన్ 27వ తేదీతో క్రికెట్ లో రెండు అద్భుతాలు జరిగాయి. ఒకటి టీ 20లో టీమిండియా 100వ మ్యాచ్ ఆడుతుంటే.. మరొకటి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంఖ్య 100 కోట్లకు చేరుతుంది. ప్రపంచంలో క్రికెట్ అభిమానులు ఎంత మంది ఉన్నారు.. ఏ వయస్సు వారు ఉన్నారు అనే వివరాల సేకరణలో భాగంగా నీల్సన్ స్పోర్ట్స్ ఓ సర్వే నిర్వహించింది. ఆ ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి.

ప్రపంచంలో 100 కోట్ల మంది క్రికెట్ అంటే ఇష్టపడుతున్నారు. వీరిలో 39శాతం మహిళలు, బాలికలు ఉన్నారు. క్రికెట్ ఇష్టపడే వారి సరాసరి వయస్సు 34 ఏళ్లు. ఇక క్రికెట్ ను జీవితంలో ఒక్కసారి అయిన ఆడిన వారు 30 కోట్ల మంది. టెస్టులు, వన్డేలు, టీ 20 ఇలా అన్ని ఫార్మెట్లను ఇష్టపడే వారు 64శాతం మంది.. అంటే 64 కోట్ల మంది ఫార్మెట్ ఏదైనా సరే క్రికెట్ మ్యాచ్ అంటే చాలు చూసేస్తారు. ప్రతి ముగ్గురు క్రికెట్ అభిమానుల్లో ఇద్దరు మహిళా క్రికెట్ పైనా మక్కువ చూపిస్తున్నారు. దాన్ని కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు. ఇండియాలో క్రికెట్ అంటే ఆట కాదు.. ఓ మతం అని ఊరికే అనలేదు.. ఈ డేటా చాలు దానికి నిదర్శనం.. క్రికెట్ జయహా..

Posted in Uncategorized

Latest Updates