అంతా తూచ్.. పప్పులో కాలేశాం : పెట్రోల్, డీజిల్ తగ్గింది పైసా మాత్రమే

pet

16 రోజుల పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు బ్రేక్ పడింది. 63, 56 పైసలు తగ్గింది అంటూ ప్రచారం జరిగింది. వాస్తవంగా ఉదయం 6 గంటల వరకు ఇదే తగ్గింపు ఉందని అందరూ అనుకున్నారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఆయిల్ కంపెనీలు వెంటనే మరో ప్రకటన విడుదల చేశాయి. తగ్గింది ఒక్క పైసా మాత్రమే అని తెలిపాయి. మరి పెట్రోల్ పై 63, డీజిల్ పై 56 పైసలు తగ్గిందని ప్రకటించారు కదా అని వాహనదారులు ప్రశ్నించారు. దీనికి వివరణ ఇచ్చింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. తప్పు జరిగిపోయింది.. అంకెల్లో తప్పు దొర్లింది. అంతర్జాతీయ రేట్లను అనుగుణంగా ధరలు సవరించటంలో అయోమయానికి గురయ్యాం. తగ్గింది కేవలం పైసా మాత్రమే అని వెల్లడించింది.

ఇక్కడే వాహనదారులకు మండింది. 16 రోజుల తగ్గిస్తున్నాం.. 63పైసలు అంటూ ప్రకటించి.. ఇప్పుడు అంతా తూచ్ అంటే ఎలా అంటున్నారు. తగ్గించకపోయినా పర్వాలేదు కానీ.. పైసా తగ్గింపు ఏంటీ అంటూ మండిపడుతున్నారు వినియోగదారులు. పైసా తగ్గింపుపై.. నవ్విపోతున్నారు. రూపాయి విలువే భారీగా పతనం అయ్యింది.. అలాంటిది పైసా ఏ విధంగా తగ్గించినట్లు అవుతుందని ప్రశ్నిస్తున్నారు వాహనదారులు.

పెట్రో రేట్లపై దేశవ్యాప్తంగా భగ్గుమంటున్నారు ప్రజలు. ఆయిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. పెరుగుతున్న పెట్రో ధరలపై సామాన్యుడిపై పెనుభారం పడుతుందంటున్న కేంద్రం.. తగ్గింపు కోసం చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని చెబుతోంది. కానీ పెట్రోలియం మినిస్ట్రీ చెబుతున్న మాటలకు.. ఆయిల్ కంపెనీల తీరుకు పొంతన లేకుండాపోయింది.

Posted in Uncategorized

Latest Updates