అంతా ఫ్యామిలీకి చెందినవారే : ఒకే ఇంట్లో 11మంది సూసైడ్

DEATHఢిల్లీలోని బురారీ ఏరియాలో ఘోరం జరిగింది. ఆదివారం (జూలై-1) ఉదయం ఒకే ఇంట్లో  పదకొండు మృతదేహాలు బయటపడ్డాయి. వీరిలో ఏడుగురు మహిళలు… నలుగురు పురుషులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.  స్థానికుల సమాచారంతో.. పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. అయితే వీరంతా ఒకే ఫ్యామిలీకి చెందినవారిలా చెబుతున్నారు స్థానికులు.

బురారీ ప్రాంతంలోని గురుగోవింద్ సింగ్ ఆస్పత్రికి ఎదురుగా గల నివాసంలో ఈ విషాదం చోటుచేసుకుంది. కళ్లకు గంతలతో వీరంతా ఉరితో ఉన్నారు.  వ్యాపారం నిర్వహిస్తున్న వీరంతా ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నట్లు తెలిపిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Posted in Uncategorized

Latest Updates