అంతా సీక్రెట్ : కిమ్ విమానం రష్యాలో ప్రత్యక్షం

నిన్నటి వరకు రష్యాకి వీరవిధేయుడు.. జస్ట్ రెండు నెలల క్రితమే అమెరికాకు దాసోహం అన్నాడు.. అణు స్థావరాలను సైతం ధ్వంసం చేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో.. సింగపూర్ లో భేటీ అయ్యాడు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. ఇక అమెరికాకు మిత్రపక్షంగా.. రష్యాకు దూరంగా ఉంటాడని డిసైడ్ అయిపోయారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఉత్తరకొరియా విమానం రష్యాలోని వ్లాదివో స్టోక్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. దీనిపై అంతర్జాతీయ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కిమ్ జాంగ్ వచ్చాడా లేక ఆ దేశం ప్రతినిధులు వచ్చారా అనే విషయంపై ఆరా తీయటం మొదలుపెట్టారు. అలా ఎంక్వయిరీ నడుస్తున్న సమయంలోనే అదే విమానం అక్కడి నుంచి ఎగిరిపోయింది. ఉత్తరకొరియా నుంచి ఆ విమానంలో వచ్చిన వారు ఎవరు అయి ఉంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.

సెప్టెంబర్ నెలలో రష్యాలో తూర్పు దేశాల ఆర్థిక సమాఖ్య సదస్సు జరగనుంది. ఆ సమావేశంలో కిమ్ కూడా పాల్గొనబోతున్నారు. ఆ ఏర్పాట్లను సమీక్షించేందుకు ఉత్తరకొరియా ఉన్నతాధికారులు వచ్చారని రష్యా మీడియా అంటోంది. కిమ్ వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కూడా స్పష్టం చేస్తోంది. అంతర్జాతీయంగా మీడియాలో కథనాలు వస్తుండటంతో.. రష్యా అధికారులు స్పందించారు. చైనా నుంచి ప్రభుత్వ ప్రతినిధులు వస్తున్నారని సమాచారం ఉందని.. ఉత్తర కొరియా నుంచి ఎలాంటి సమాచారం లేదని వివరణ ఇచ్చారు. అందరూ మూకుమ్మడిగా ఉత్తరకొరియా విమానం రష్యా దేశంలోకి రాలేదని వాదిస్తున్నా.. వ్లాదివోస్టోక్ ఎయిర్ పోర్ట్ లోని ఫ్లయిట్ ఎవరికి అని మాత్రం చెప్పటం లేదు. చైనాపై నెపం నెడుతున్నా.. చైనా – ఉత్తరకొరియా విమానాలను ఉపయోగించుకునే పరిస్థితుల్లో లేదనేది జగమెరిగిన సత్యం. మరి కిమ్ రష్యాలోకి వచ్చాడా.. రహస్యంగా చర్చలు జరిపాడా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.

Posted in Uncategorized

Latest Updates