అంత్యక్రియల్లో ఆ నవ్వుడేంది.. బాలీవుడ్ తారలపై విమర్శలు

ముంబై : బాలీవుడ్ ప్రముఖులు కొందరికి పద్ధతులే తెలీదని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఎక్కడెలా బిహేవ్ చేయాలో అన్న మినిమం సెన్స్ లేకుండా ఎలా ఉంటున్నారో అని దుమ్మెత్తిపోస్తోంది ఆన్ లైన్ సమాజం. లెజెండరీ బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ భార్య… కృష్ణ రాజ్ కపూర్ అక్టోబర్ ఒకటో తేదీన చనిపోయినప్పుడు నిర్వహించిన అంత్యక్రియల్లో కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు నవ్వుతూ కనిపించడాన్ని సహించలేకపోతున్నారు జనం.

కృష్ణరాజ్‌ కపూర్‌ కు అమితాబ్‌ బచ్చన్, ఆమీర్ ఖాన్, కరణ్ జోహార్, ఆమిర్ ఖాన్, ఐశ్వర్యా రాయ్, రాణి ముఖర్జీ, అలియా భట్‌ సహా.. ఎంతోమంది ప్రముఖులు నివాళులు అర్పించారు. సాయంత్రం అంత్యక్రియల సందర్భంగా… ప్రేయర్ మీట్ నిర్వహించారు. అక్కడ… కరణ్‌ జోహార్‌, ఆమిర్‌ ఖాన్‌, రాణీ ముఖర్జీ నవ్వుతూ కనిపించారు. ఈ ఫొటోలు అన్ని సోషల్ ప్లాట్ ఫామ్స్ లో వైరల్ అయ్యాయి. మీరేమైనా అంత్యక్రియలకు హాజరయ్యామనుకుంటున్నారా.. లేక ఏదైనా పార్టీకి వచ్చామని అనుకుంటున్నారా.. అంటూ కామెంట్లతో చీల్చి చెండాడుతున్నారు.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్… ఇలా బిహేవ్ చేయడం సిగ్గుచేటని అన్నారు కొందరు. చావుకు వచ్చి నవ్వుతున్నందుకు సిగ్గుపడండి అని రాణీ ముఖర్జీ, కరణ్‌ జోహార్‌ లను విమర్శలతో ఫసక్ చేసేశారు. ఐతే.. దీనికి విరుద్ధంగా ఓ దిక్కుమాలిన డిస్కషన్ కూడా ఇపుడు మొదలైంది. చావు కార్యక్రమాల్లో భారతీయులు ఎందుకు చచ్చినట్టుగా ముఖం పెట్టాలి.. అంతా అయ్యాక నవ్వుతూ ఉంటే తప్పేంటని కొద్దిమంది రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates