‘అంత‌రిక్షం’ ట్రైల‌ర్ విడుద‌ల‌

వరున్ తేజ్ హీరోగా ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా అంతరిక్షం. తెలుగు సినిమాలో మొట్టమొదటి సారి ఫుల్ లెన్త్ అంతక్షం బేస్డ్ గా వస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో వరున్ తేజ్ స్పేస్ సైంటిస్ట్ గా కనిపించనున్నారు. ఇందులో వరున్ తేజ్ కు జోడీగా అధితి రావు హైద‌రీ, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సినిమాను నిర్మించారు. సినిమాలోని చాలా సన్నివేశాలను జీరో గ్రావిటీ సెట్స్ పై చిత్రీకరించారు. ఆదివారం రోజు ‘అంతరిక్షం’ ట్రైల‌ర్ ను రిలీజ్ చేశారు. విజువల్ వండర్ గా ‘అంతరిక్షం’ ఉండనుందని సినీ యునిట్ తెలిపింది. డిసెంబర్ 21 వ తారీకున సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు.

Posted in Uncategorized

Latest Updates