అందరం ‘యో యో’ టెస్ట్ పాసయ్యాం: గోస్వామి

తాజాగా బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో నిర్వహించిన యో యో టెస్టులో భారత మహిళల జట్టు అందరూ యో యో టెస్ట్ పాసయ్యారు. ఈ మేరకు సీనియర్ బౌలర్ జులన్‌ గోస్వామి తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇతర దేశాల్లో క్రికెట్ లీగ్‌లు ఆడుతున్న కారణంగా కొందరు ప్లేయర్లు యో యో టెస్టుకు హాజరుకాలేదు. త్వరలో వారందరు కూడా హాజరవుతారు’ అని అకాడమీ నిర్వాహకులు తెలిపారు.

ప్రస్తుతం ఏ దేశ క్రికెటర్ అయినా సరే జాతీయ జట్టులోకి ఎంపిక కావాలంటే యో-యో పరీక్ష నెగ్గాల్సిందే. గ్రౌండ్ లో మెరుగైన ఆట ప్రదర్శించినా.. యో యో టెస్టులో ఫిట్‌నెస్‌ సాధిస్తేనే సెలెక్టర్లు జట్టులో స్థానం కల్పిస్తున్నారు. అంబటి రాయుడు ఐపీఎల్-11 సీజన్ లో చెన్నై తరుపున  అత్యధిక పరుగులు చేసినా.. యో యో టెస్టులో ఫెయిలవ్వండతోనే భారత జట్టుకు ఎంపిక కాలేదు.

Posted in Uncategorized

Latest Updates