అందరి అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : కేటీఆర్

భవిష్యత్ తలుచుకొని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని తెలిపారు మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహ్మారెడ్డి. ఓట్ల కోసం నోటికి వచ్చిన వాగ్దానాలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందన్నారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తూనే.. యువతకు అవసరమైన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రులు.. సోమవారం (జూలై-16) మండేపల్లిలో కొత్తగా కట్టిన ITI భవనాన్ని ప్రారంభించారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నట్లు చెప్పారు. ఇంటింటికీ తాగునీరు.. ప్రతి ఎకరాకు సాగునీరు.. అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు కేటీఆర్.  తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పిన ఆయన.. కృష్ణా, గోదావరి నీళ్లను ఒడిసిపట్టి.. ప్రతి ఎకరాకు నీరు అందిస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకుందని… అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. అందరి అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్న కేటీఆర్. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు.

 

Posted in Uncategorized

Latest Updates