అందరూ ఎగ్గొడుతున్నారా ఏంటీ : SBI నష్టం రూ.7వేల 718 కోట్లు

sbi-siteస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్. నాలుగో క్వార్టర్ రిజల్ట్స్ ద్వారా షాకింగ్ ఇచ్చింది. నికర నష్టం రూ.7వేల 718 కోట్లుగా తేల్చింది. ఇంత పెద్ద మొత్తంలో నష్టాలను నమోదు చేయటం ఇదే. నికర నష్టం.. 7వేల 718 కోట్లకు చేరటంతో మార్కెట్ వర్గాలు కూడా షాక్ అయ్యాయి. నష్టాలతోపాటు.. మొండి బకాయిలు కూడా డబుల్ అయ్యాయి. గత ఏడాది రూ.11వేల 740 కోట్లుగా ఉన్న మొండి బకాయిలు.. ఈసారి రూ.28వేల కోట్లకు చేరాయి. దాదాపు మూడింతలు పెరిగటం ఆశ్చర్యం కలిగిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టాలు, మొండి బకాయిల లిస్ట్ చూసి స్టాక్ మార్కెట్ కూడా షాక్ అయ్యింది.

ఈ క్వార్టర్ లో SBI నష్టం రూ.2వేల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. అందుకు భిన్నంగా మూడు రెట్లు అధికంగా నష్టాన్ని ప్రకటించటంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అంతే కాకుండా.. మొండి బకాయిలు కూడా డబుల్ కావటం.. ఊహించని విధంగా పెరగటంతో బ్యాంక్ అధికారులు ఏం చేస్తున్నారు అనే డౌట్ మొదలైంది. నీరవ్ మోడీ మోసంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.13వేల కోట్ల నష్టాన్ని ప్రకటించగా.. ఆ తర్వాత 7వేల 718కోట్లతో SBI రెండో స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో SBI ఆదాయం 57వేల కోట్ల నుంచి.. 68వేల కోట్లకు చేరటం విశేషం. పెరిగిన ఆదాయంతో పోల్చితే నష్టం, మొండి బకాయిలు భారీగా ఉన్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates