అందుకే కంపు కొడతాయి : రైళ్లలోని దుప్పట్లను ఉతికేది అప్పుడప్పుడే

acరైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇప్పటివరకూ ఏసీ కోచ్ లలో రెండు నెలలకొకసారి ఉతికే బ్లాంకెట్లను ఇకపై నెలలో రెండు సార్లు ఉతకనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ రైల్వే ఏసీ ప్యాపింజర్లకు 3.90 లక్షల బ్లాంకెట్లు అవసరమవుతాయని రైల్వే శాఖ తెలిపింది. రివైజ్డ్ స్పెసిఫికేషన్స్ ప్రకారం కొత్త బ్లాంకెట్లను ఉలెన్, నైలాన్ తో కలిపి తయారు చేయనున్నట్లు తెలిపింది. వాషింగ్ ఫ్రీక్వెన్సీని పెంచడం ద్వారా బ్లాంకెట్ల సర్వీస్ లైఫ్ నాలుగేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిపోనుంది. ప్రస్తుతమున్న హెవీ  ఉలెన్ బ్లాంకెట్ల ధర రూ.400 ఉందని, కొత్త ధరను త్వరలో నిర్ణయించనున్నట్లు రెగ్యులర్ వాషబుల్ బ్లాంకెట్స్ ఫర్ ట్రైన్ ట్రావెలర్స్ టాక్స్ లో పనిచేస్తున్న సీనియర్ రైల్వే మినిస్ట్రీ అధికారి తెలిపారు. బ్లాంకెట్లు కంపు కొడుతున్నాయంటూ ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున కంఫ్లెయింట్స్ తో రావడంతో భారతీయ రైల్వే  బ్లాంకెట్ల వాషింగ్ విషయంలో యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఫస్ట్ క్లాస్ ఏసీ ప్రయాణికుల బ్లాంకెట్ కవర్ ను రెగ్యూలర్ గా వాష్ చేస్తుంటారు. అయితే సెండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఏసీ ప్రయాణికులకు మాత్రం ఈ సదుపాయం లేదు.

 

Posted in Uncategorized

Latest Updates