అందుకే పవన్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నా: ఉండవల్లి

UNDAVALLIఏపీ ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్. ఆదివారం (ఫిబ్రవరి-11) జనసేన అధినేత పవన్ కల్యాణ్‌- ఉండవల్లి భేటీ అయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ భేటీలో పలు విషయాలపై నిశితంగా చర్చించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఉండవల్లి.. ఏ ప్రభుత్వం అబద్ధాలు చెప్పదు, నిజాలు దాస్తుందన్నారు. పవన్‌ కల్యాణ్‌ నాతో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదనీ.. సాధారణ వ్యక్తిలా నాతో పవన్‌ మాట్లాడారన్నారు. అందుకే పవన్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నానని ఉండవల్లి చెప్పారు. పవన్‌ తీసుకున్న టాస్క్‌ అద్భుతమని ఉండవల్లి ప్రశంసలు కురిపించారు. పవన్‌ చాలా మంది మేధావులతో మాట్లాడుతున్నారనీ.. JACలో  తనను చేర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. పవన్‌ ఇప్పుడే రాజకీయాలు ప్రారంభించారనిపిస్తోందని ఆయన అన్నారు. ఇప్పుడు ఏపీ ఎప్పుడూలేనంత గడ్డు పరిస్థితుల్లో ఉందని.. ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరముందన్నారు ఉండవల్లి.

 

Posted in Uncategorized

Latest Updates