అందుకే మనకు కోపమా : ఖలిస్తాన్ వేర్పాటువాదితో ప్రధాని భార్య భేటీ

Trudeau_wifefeb22

ఖలిస్తాన్ వేర్పాటువాదులకు వ్యతిరేకమని కెనడా ప్రధాని ట్రూడో చెబుతున్నా.. జరుగుతున్న పరిణామాలు అందుకు  భిన్నంగా ఉన్నాయి. ఖలిస్తాన్  వేర్పాటువాద నేత, భారత్ లో నిషేధం ఎదుర్కొంటున్న  ఇంటర్నేషనల్  సిక్కు యూత్  ఫెడరేషన్ కీలక సభ్యుడు  జస్పాల్  అత్వాల్ తో కలిసి విందులో పాల్గొనటం కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 20న ముంబైలో  జరిగిన కార్యక్రమంలో  ట్రూడో భార్య  సోఫి ట్రూడోతో కలిసి కెనడా ప్రధాని భార్య  ఫొటో దిగడం వివాదాస్పదంగా మారింది.

ట్రూడోతో  పాటు భారత  పర్యటనకు  వచ్చిన కెనడా  మంత్రి  అమర్జీత్ సోహి కూడా జస్పాల్  అత్వాల్ తో  కలిసి  ఫొటో దిగాడు. ట్రూడో గౌరవార్ధం ఈ రోజు ఇచ్చే విందుకు కూడా ఆ ఉగ్రవాదికి ఆహ్వానం అందింది. అయితే.. అధికారిక  విందుకు జస్పాల్  అత్వాల్ ఆహ్వానాన్ని రద్దు చేశామని కెనడా  హైకమిషన్  వివరణ ఇచ్చింది. కెనడా ప్రధాని భద్రతపై రాజీలేదని చెప్పింది. 1986లో వాకోవర్ ఐలాండ్ లో పంజాబ్ మంత్రి  మల్కియత్ సింగ్ సిద్ధుపై  హత్యాయత్నం కేసులో జస్పాల్ అత్వాల్  దోషిగా ఉన్నాడు. సిద్దు కోసం మాటు వేసి.. ఆయన  కారుపై  కాల్పులు జరిపిన నలుగురిలో జస్పాల్  అత్వాల్ ఒకడు.  అలాంటి  జస్పాల్ తో.. కెనడా  ప్రధాని భార్య, మంత్రి ఫొటోలు  దిగడం ఇప్పుడు వివాదాదంగా మారింది.

uhg

Posted in Uncategorized

Latest Updates