అందుకే మాన్సిని హత్య చేశా: సయ్యద్

మోడల్‌ కావాలనుకున్న 20ఏళ్ల యువతి మాన్సి దీక్షిత్ హత్య ముంబైలో కలకలం సృష్టించింది. హత్య చేసిన నిందితుడు ముజమిల్ సయ్యద్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేయగా తానే హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. మాన్సి దీక్షిత్‌ను చంపి పొదల్లో పడేసినట్లు సయ్యద్ ఒప్పుకున్నాడు. తన కోరిక తీర్చనందుకే దీక్షిత్‌ను హత్య చేసినట్లు సయ్యద్ చెప్పాడు. మాన్సీ దీక్షిత్ స్వస్థలం రాజస్థాన్‌. ఆమె ముంబైకి ఆదివారం రాజస్థాన్ నుంచి వచ్చింది. సయ్యద్ కూడా తన స్వస్థలం హైదరాబాద్ నుంచి ముంబైకి కొన్ని రోజుల ముందే చేరుకున్నాడు. అందేరి వెస్ట్‌లోని సయ్యద్ నివాసానికి వెళ్లి మొదటి సారిగా దీక్షిత్ మాట్లాడింది. ఇదే సమయంలో తన లైంగిక వాంఛ తీర్చాల్సిందిగా దీక్షిత్‌ను డిమాండ్ చేసినట్లు సయ్యద్ పోలీసుల విచారణలో తెలిపాడు. ఇందుకు మాన్సీ దీక్షిత్ నిరాకరించడంతో ఆమె తలపై స్టూలుతో కొట్టినట్లు చెప్పాడు సయ్యద్. పోలీసుల విచారణ సమయంలో ప్రతిసారి మాట మార్చుతుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ఎంక్వైరీ చేశారు. దీంతో నిజం బయటపెట్టాడు సయ్యద్.

ఇప్పటి వరకు సయ్యద్ నేరాన్ని నిరూపించగలిగే అన్ని ఆధారాలు దొరికాయని… మరికొన్ని ఆధారాలను సేకరిస్తున్నామని పోలీసులు చెప్పారు. తలపై బలంగా స్టూలుతో కొట్టడంతో దీక్షిత్ స్పృహ కోల్పోవడంతో తాను చాలా భయపడినట్లు చెప్పాడు సయ్యద్. వెంటనే స్ప్రుహలోకి తీసుకొచ్చేందుకు ఆమె ముఖం పై నీళ్లు చల్లినట్లు తెలిపాడు. అయితే కొంత స్పృహలోకి వచ్చినట్లు చెప్పిన సయ్యద్… ఇంటికి అతని తల్లి వస్తుందని భయపడి దీక్షిత్ గొంతును తాడుతో గట్టిగా బిగించి హత్యచేసినట్లు చెప్పాడు. తర్వాత క్యాబ్ మాట్లాడుకుని అప్పటికే సూట్‌కేసులో మృతదేహాన్ని ఉంచి చెట్టు పొదల్లో పడేసినట్లు సయ్యద్ తెలిపాడు.

Posted in Uncategorized

Latest Updates