అంపైర్ తొండి.. తప్పుడు నిర్ణయానికి కోహ్లీ బలి

పెర్త్: రెండో టెస్టులో విరాట్ కోహ్లీ ఔట్ పై వివాదం నడుస్తోంది. వీడియోలో బాల్ నేలను తాకిన తర్వాతే సెకండ్ స్లిప్ లో ఉన్న హ్యాండ్స్ కోంబ్ క్యాచ్ పట్టినట్టుగా తేలింది. కోహ్లీ ఔట్ కాకున్నా.. అంపైర్ తప్పుడు నిర్ణయం ప్రకటించాడంటూ ఆరోపణలు వస్తున్నాయి.

ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న సెకండ్ టెస్ట్ లో  ఆదివారం డిసెంబర్-16న ఈ పరిణామం చోటుచేసుకుంది. అప్పటివరకు మంచి జోరుమీదున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. సెంచరీ కూడా పూర్తిచేసి.. ఇండియా ఇన్నింగ్స్ కు బ్యాక్ బోన్ లా నిలిచాడు. కోహ్లీ ఊపుతో… ఆస్ట్రేలియా సాధించిన స్కోరును దాటేసేలా ఇండియా కనిపించింది. అలాంటి సమయంలో కోహ్లీ ఔట్ అయ్యాడు. నిజానికి అది ఔట్ కాదు. 93వ ఓవర్లో  కమిన్స్‌ బౌలింగ్‌ లో కోహ్లీ షాట్‌ కు యత్నించగా.. సెకండ్‌ స్లిప్‌ లో హ్యాండ్స్‌ కాంబ్‌ క్యాచ్‌ పట్టాడు. ఈ క్యాచ్‌ వివాదాస్పదంగా మారింది. కోహ్లి ఔట్‌ ను.. పలు కోణాల్లో చూసినా .. బాల్ నేలకు తగిలినట్లు స్పష్టంగా కనిపించింది. ఇటువంటి పరిస్థితుల్లో బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద బ్యాట్స్‌ మన్‌ కే అనుకూలంగా నిర్ణయం ప్రకటిస్తుంటారు అంపైర్లు. కానీ.. ఇందుకు విరుద్ధంగా కోహ్లీని ఔట్‌ గా అంపైర్ ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఆస్ట్రేలియాకు అనుకూలంగా సాఫ్ట్ నిర్ణయం తీసుకున్నాడంటూ సోషల్ మీడియాల్లో విమర్శలు వెల్లువెత్తున్నాయి.

కోహ్లీని ఔట్‌గా ప్రకటిస్తూ థర్డ్ అంపైర్ ‘నైగెల్ లాంగ్’ తీసుకున్న నిర్ణయాన్ని ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. బాల్ నేలను తాకుతున్నట్టు క్లారిటీగా కనిపిస్తున్నా ఔట్ ఎలా ఇస్తారంటూ అంపైర్ పై మండిపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపైనే చర్చ. కోహ్లి ఔట్ వివాదంపై భారత క్రికెట్ అభిమానులు వరస పెట్టి ట్వీట్లు చేస్తున్నారు. ‘ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని ఒకరు సెటైర్‌ వేయగా, హ్యాండ్స్‌ కాంబ్‌ కు క్రీడా స్ఫూర్తి లేదంటూ మరొకరు మండిపడ్డారు. ‘ఇది కచ్చితంగా మ్యాచ్‌ చేంజింగ్‌ నిర్ణయమే’ అని మరొక అభిమాని ట్వీట్ చేశాడు. విరాట్ ఔట్ కావడంతో.. ఆ తర్వాత టపటపా ఔట్ అయ్యారు భారత ప్లేయర్లు. మ్యాచ్ ఇండియా గెలిస్తే ఓకే. ఒకవేళ టార్గెట్ చేజింగ్ లో ఇండియా ఇబ్బందిపడితే.. కోహ్లీ ఔట్ మ్యాచ్ ను మలుపుతిప్పినట్టుగా భావించడం ఖాయం.

 

Posted in Uncategorized

Latest Updates