అంబానీ ఇంట ఎగేజ్మెంట్ సందడి

akashambaniరిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. శనివారం(మార్చి- 24వ) గోవాలో అత్యంత వైభవంగా సన్నిహితుల మధ్య ఈ వేడుకను నిర్వహించారు.

ఆకాశ్, శ్లోకా మెహతాలు చిన్ననాటి మిత్రులు. ధీరుబాయ్ అంబానీ స్కూల్లో ఇద్దరు కలిసే చదువుకున్నారు. శ్లోకా ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల కంపెనీ రోజీ బ్లూ డైమాండ్స్ సంస్థ అధినేత రసెల్ మెహతా కూతురు. డిసెంబర్ నెలలో వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. నిశ్చితార్థ వేడుకలో అంబానీ తనకు కాబోయే కోడలికి స్వీట్ తినిపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతున్నాయి. ఆకాశ్‌,శ్లోకా వివాహం చేసుకోబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.

రసెల్ మెహతా కూతురైన శ్లోక లండన్‌లోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ఎకనామిక్స్‌లో పట్టా పొందారు. ప్రస్తుతం తమ డైమండ్ కంపెనీలో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె కనెక్ట్‌ఫర్ అనే సంస్థ సహ వ్యవస్థాపకురాలు. ఆకాశ్ రిలయెన్స్ రిటైల్, జియోలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates