అంబుడ్స్ మన్ రిపోర్టు చట్టబద్ధంగా లేదు : వివేక్ వెంకటస్వామి

vivek sirతనను డిస్ క్వాలిఫై చేస్తూ.. అంబుడ్స్ మన్ ఇచ్చిన రిపోర్ట్ చట్టబద్ధంగా లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తనకు వర్తించబోవన్నారు. HCA రూల్స్ లో గానీ, లోదా కమిటీ సిఫార్సుల్లో గానీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంశం లేదన్నారు. తనపై ఆరోపణలను రుజువు చేస్తే రాజీనామా చేసి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. అలాగే.. కాకా మెమోరియల్ టీ 20 మ్యాచ్ పై వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు వివేక్ వెంకటస్వామి. టోర్నమెంట్ నిర్వహణకు ఎవరూ ముందుకు రాకపోయినా.. విశాక ఇండస్ట్రీస్ ఎక్కువ అమౌంట్ కి టెండర్ వేసిందన్నారు. దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేసి టోర్నమెంట్ నిర్వహించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారును మాత్రమే అని.. నాకు ఎలాంటి మంత్రి హోదా లేదన్నారు వివేక్ వెంకటస్వామి. బై లాస్ లో కూడా అలాంటిది ఏం లేదన్నారు.

Posted in Uncategorized

Latest Updates