అంబులెన్సులకు దారివ్వండి: మంత్రి కేటీఆర్

ktr
రోడ్లపై VVIP ల కాన్వాయ్ వెళ్తున్నా… అంబులెన్స్ లను ఆపేయవద్దన్నారు మంత్రి కేటీఆర్. దీనికి సంబంధించి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల మేడ్చల్‌ జిల్లాలోని దమ్మాయిగూడలో ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని ప్రైవేట్ కారులో తరలించేందుకు ప్రయత్నించగా… అదే సమయంలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్ అటువైపు రావడంతో ఆ కారును పోలీసులు నిలిపేశారు. కాన్వాయ్‌ వెళ్లేవరకు పోలీసులు అతన్ని 20 నిమిషాల పాటు నిలిపివేశారు. అదే విషయంపై కేటీఆర్ కు ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ..జరిగిన తప్పుకు క్షమాపణలు చెబుతున్నామని…మరో సారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates