అంబులెన్స్ డ్రైవర్ డబ్బు డిమాండ్.. ఆలస్యంతో మహిళ మృతి

ఒరిస్సా : ప్రమాదం జరిగిన వెంటనే గుర్తొచ్చేది అంబులెన్స్. ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్న సమయంలో అంబులెన్స్ డ్రైవర్స్ సైరన్ మోగిస్తూ.. స్పీడ్ గా హస్పిటల్ కి చేరుస్తారు. ఇది అంబులెన్స్ డ్రైవర్ల పని. కానీ..అంబులెన్స్ డ్రైవర్ చేసిన పనికి మహిళ ప్రాణాలు కోల్పోయింది.

సరిపడ డబ్బులు ఇస్తేనే అంబులెన్స్ కదులుతుందని బేరమాడుతూ టైమ్ వేస్ట్ చేశాడు. చివరకు అతడికి డబ్బులిచ్చి పేషంట్ ని అంబులెన్స్ లో హస్పిటల్ కి తీసుకువచ్చినా లాభం లేకపోయింది. అప్పటికే ఆమె మరణించిందని..కాస్త ముందు తీసుకువస్తే బతికేదని చెప్పారు డాక్టర్లు. ఈ యధార్థ సంఘటన ఒరిస్సాలో జరిగింది.

వివరాలు ఇలా ఉన్నాయి..

మల్కన్‌గిరి జిల్లాలోని మల్కన్‌గిరి సమితి మర్కగుడ గ్రామానికి చెందిన పూల్‌ పోడియామి అనే మహిళత కుటుంబసభ్యులు గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన ఆమె పురుగుమందు తాగేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు ఇర్మా మడకామి వెంటనే అంబులెన్స్‌ కు ఫోన్‌ చేయగా.. వచ్చిన అంబులెన్స్‌ డ్రైవర్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు రూ.1000 అవుతుందని డిమాండ్‌ చేశాడు.

తన దగ్గర అంత సొమ్ము లేదని మూడు వందల నుంచి నాలుగు వందల వరకు మాత్రమే ఇవ్వగలనని నిస్సహాయతను వ్యక్తం చేశాడు. దీనికి డ్రైవర్‌ ససేమిరా అన్నాడు. చివరికి ఇర్మా మడకామి డ్రైవర్‌ డిమాండ్‌ చేసిన డబ్బుకు ఒప్పుకుని ముందుగా రూ.500 ఇస్తా..ఆస్పత్రికి చేరాక రూ.500 ఇస్తానని ఒప్పించాడు.

బాధిత మహిళను అంబులెన్స్‌ లో ఎక్కించి ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతిచెందింది. ఆస్పత్రికి చేరుకున్న తరువాత మృతురాలి సోదరుడు ఇర్మా మడకామి డ్రైవర్‌ బేరం విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యానికి తెలియజేయగా..సీడీఎంఓ అజిత్‌ కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ.. అంబులెన్స్‌ డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని బాధితుడికి నచ్చజెప్పారు.

Posted in Uncategorized

Latest Updates