అంబులెన్స్, విమానం రెడీ : పూర్తయిన శ్రీదేవి పోస్టుమార్టం ప్రక్రియ

sridevi-Dead-bodyఈ రోజు (ఫిబ్రవరి26) సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భౌతికకాయం ముంబై చేరుకోనుంది. ఇప్పటికే అక్కడ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆస్పత్రి దగ్గర అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంది. దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో రిలయన్స్ కంపెనీకి చెందిన ప్రత్యేక విమానం కూడా సిద్ధంగా ఉంది. దుబాయ్ సమయం ప్రకారం 2 గంటలకు శ్రీదేవి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు వెల్లడించింది రషీద్ ఆస్పత్రి. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 6 గంటలకు ముంబై చేరుకోనుంది.

సెలబ్రిటీ అయినా సామాన్యులు అయినా ఒకే ప్రక్రియ ఉంటుందని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. ఆదివారం కావటంతో కొంత సమయం లేటు అయిన మాట వాస్తవమే అన్నారు. శ్రీదేవి చనిపోయి 37 గంటలు గడుస్తున్నా ఇంకా ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడంపై ఆస్పత్రి యాజమాన్యం కూడా విచారం వ్యక్తం చేసింది. మరి కొద్ది సేపట్లో ఆమె భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు ట్విట్ చేసింది. ఆమెను విమానం దగ్గరకు తీసుకెళ్లడానికి హాస్పిటల్ యాజమాన్యం ఓ అంబులెన్స్ కూడా సిధ్ధం చేసింది.

Posted in Uncategorized

Latest Updates