అంబేడ్కర్ ఆశయాలు ఆదర్శం : స్వామిగౌడ్

ambedkarతెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిస్తుందన్నారు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్. రాజ్యంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుని అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సభాపతి మధుసుదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ అంబేడ్కర్‌ను గుర్తు చేసుకోవడమంటే ఆయన ఆశయాలను కొనసాగించడమేనన్నారు. అంబేడ్కర్ ఆలోచనా విధానం మనందరికీ ఆదర్శనీయమన్నారు. అంబేడ్కర్ రాజ్యంపరంగా కల్పించిన వెసులుబాటు వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు స్వామిగౌడ్.

 

Posted in Uncategorized

Latest Updates