అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ ల సేవలు మరువలేనివి: స్వామిగౌడ్

VIDYAఅంబేడ్కర్, జగ్జీవన్ రామ్ లు దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు మండలి చైర్మెన్ స్వామి గౌడ్. బాబు జగ్జీవన్ రామ్ ఎడ్యుకేషనల్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో..రవీంద్రభారతిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు అందించారు. ఈ కార్యక్రమానికి స్వామిగౌడ్, ప్రభుత్వసలహాదారు వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవార్డులివ్వడం అభినందనీయమన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి.

బాబు జగ్జీవన్ రామ్ ఎడ్యుకేషనల్ డెవలప్ మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు అందించారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి మండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రభుత్వ సలహాదారుడు వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి వినోద్ హాజరయ్యారు. విద్యార్థులంతా క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని సూచించారు నేతలు. విద్యార్థులు జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకొని పాజిటివ్ ఆలోచనలతో ముందుకెళ్లాలన్నారు. తల్లిదండ్రుల కలలు నిజం చేసినప్పుడే తమ జీవితం సార్థకకమవుతుందన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకొని గొప్పవారు కావాలని సూచించారు మండలి ఛైర్మన్ స్వామి గౌడ్.

విద్యతోనే అంబేద్కర్, జగ్జీవన్ రామ్ గొప్పవారు అయ్యారని చెప్పారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. జగ్జీవన్ రామ్ ఏ మంత్రిత్వశాఖలో పని చేసినా.. ఆ శాఖకి వన్నె తెచ్చారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బడుగు బలహీన వర్గాల విధ్యార్థులను గుర్తించి వారికి అవార్డులివ్వడం అభినందనీయమన్నారు మాజీ మంత్రి వినోద్. విద్య అనేది ఒక ఆయుధం లాంటిదన్నారు. ప్రతీ ఒక్కరు చదువుకొని ఎదగాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ చేసిన డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి.

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates