అంబేద్కర్ జయంతి : నెక్లెస్ రోడ్ లో కుల రహిత పరుగు

RUNడా. బీఆర్ అంబేద్కర్ 127 వ జయంతి సందర్భంగా శనివారం (ఏప్రిల్-14) హైద్రాబాద్ నెక్లెస్ రోడ్ లో కుల రహిత ఇండియాకోసం పరుగును నిర్వహించారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరిగిన రన్ ను ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ ప్రారంభించారు. TSPSC చైర్మన్ ఘంటా చక్రపాణి, లోక్ సత్తా చీఫ్ జయప్రకాశ్ నారాయణ, ఒలంపియన్ జేజే శోభ, ఇంటర్నేషనల్ అథ్లెట్స్ కల్పనారెడ్డి, శంకర్, స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు రన్ లో పాల్గొన్నారు.

విద్య, వైద్యం అందరికీ సమానంగా అందినప్పుడే కులరహిత సమాజం సాధ్యమన్నారు ప్రముఖులు. యూనివర్సిటీల్లో కులం పెద్ద సమస్యగా తయారైందన్నారు TSPSC చైర్మన్ ఘంటా చక్రపాణి. కార్యక్రమంలో కులరహిత కల్యాణ వేదిక బ్రోచర్ ను ఆవిష్కరించారు.

Posted in Uncategorized

Latest Updates