అకాల కడగండ్ల వాన.. పంటలకు తీవ్ర నష్టం

nzb-top1aఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మంగళవారం (ఫిబ్రవరి-13) కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నిర్మల్ జిల్లాలో కురిసిన అకాల కడగండ్ల వాన పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది.  ముథోల్ నియోజకవర్గంలోని కుంటాల, భైంసా,కుబీర్, తానూర్ మండలాల్లో అకాలవర్షం కురవడంతో శనగ, మొక్కజొన్న, పుచ్చకాయ, టమాట పంటలు భారీగా నష్టపోయింది.

అకాల వర్షంతో అన్నదాతలు పూర్తిగా నష్టపోయారు. అంతకు ముందు వేసిన పంటకు గులాబీ రంగుసోకి నష్టపోయిన అన్నదాతను అకాల వర్షం నిండా ముంచేసింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం జలాల్ పూర్ లో పిడుగుపడి 120 సబ్సిడీ గొర్రెలు చనిపోయాయి.

కడగండ్ల వల్ల ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉడికించి ఆరబెట్టిన పసుపు పంట కల్లాలపైనే వరదనీటికి కొట్టుకుపోయింది. మాక్లూర్‌, నిజామాబాద్‌ రూరల్‌ మండలాల్లో 45 ఎకరాల టమాట, ఆర్మూర్‌, మెండోరా, ముప్కాల్‌, మాక్లూర్‌ మండలాల్లో 62 ఎకరాల కూరగాయలు, ఆకుకూరలు, మాక్లూర్‌, రెంజల్‌ మండలాల్లో 40 ఎకరాల మామిడి తోట, రెంజల్‌ మండలంలో 6 ఎకరాల మునగతోట దెబ్బతిన్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారులు వెల్లడించారు. పసుపు కోసిన తర్వాత పంటనష్టాన్ని అధికారికంగా పరిగణనలోకి తీసుకునే వీలుండదన్నారు. ఈపాటికే పసుపు పంటంతా కోసి ఉడకబెట్టి ఆరబెడుతున్నారని, చాలా గ్రామాల్లో కల్లాలపై తడిసిపోయినట్లు రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని వివరించారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates