అక్కడికి ఎలా వెళ్లాయి : బ్రిడ్జి కింద బీమ్ లో ఇరక్కపోయిన మేకలు

goatఓ బ్రిడ్జి కింద ఉండే బీమ్‌ లో చిక్కుకుపోయిన రెండు మేకలను సురక్షితంగా కాపాడారు అధారులు. అసలు మేకలు అక్కడికి ఎలా వెళ్లాయి? ఎవరైనా వాటిని అక్కడ తీసుకెళ్లి పెట్టారా? అసలు అక్కడి దాకా ఎలా వెళ్లాయో తెలియక ఆ ప్రాంత ప్రజలు నెత్తిగోక్కుంటున్నారు.

అమెరికాలోని పెన్సిల్వేనియాలోని 50 ఫీట్ల ఎత్తైన మహోనింగ్ రివర్ బ్రిడ్జి కింద ఉండే బీమ్‌లో రెండు మేకలు చిక్కుకుపోయాయి. ఎవరైనా వచ్చి రక్షించండి అంటూ బీమ్‌లో చిక్కుకుని దిగాలుగా చూస్తుండిపోయాయి. బీమ్ లో చిక్కుకుపోయిన వాటిని చాలా సేపువరకూ ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత వాటిని గుర్తించిన పెన్సిల్వేనియా ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది క్రేన్ ద్వారా వాటిని రక్షించి వాటి యజమానికి అప్పగించారు. ఈ ఫోటోలను పెన్సిల్వేనియా టర్న్‌ పైక్ అనే ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. ఆ మేకలు అసలు అక్కడిదాకా ఎలా వెళ్లాయా అని తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్లు.
goat2

Posted in Uncategorized

Latest Updates