అక్కడ కూడా ఇదే పరిస్ధితి : అమెరికాలో పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలు

usa
రైతుల ఆత్మహత్యలు అభివృద్ది చెందుతున్న భారత్ కు మాత్రమే పరిమితం కాలేదు. అభివృద్ది చెందిన, అగ్రరాజ్యం అమెరికాలో కూడా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత అమెరికా రైతుల పరిస్ధితిపై వ్యవసాయరంగ నిపుణుడు చ్రిష్ హర్ట్ వివరించారు. దశాబ్ధ కాలంగా అమెరికా రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. అమెరికాలోని అన్నీ రంగాల్లో కన్నా ఎక్కువగా వ్యవసాయ రంగంలోనే ఆత్మహత్యలు నమోదవుతున్నట్లు ఇటీవల సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC) రీసెంట్ గా విడుదల చేసిన డేటా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం సూసైడ్ చేసుకునే వారి సంఖ్య అమెరికాలో30 ఏళ్లలో చాలా పెరిగిపోయింది. వ్యవసాయ రంగంలో ప్రతి లక్ష మందిలో 84.5 శాతం మంది సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే అమెరికాలో జరుగుతున్న ఆత్మహత్య చేసుకునేవారి సంఖ్యలో పోలిస్తే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా అమెరికాలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలలో సరైన హెల్త్ కేర్ లేక కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. US డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ లెక్కల ప్రకారం… 2013 నుంచి రైతుల ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. 2013 లో ఉన్న ఆదాయం కన్నా ఈ ఏడాది 35 శాతం తక్కువ ఆదాయం ఉంది. 15 ఏళ్లుగా రైతులు అన్ ఈక్వల్ ఎకనామీతో భాధపడుతున్నారని, పూర్తిగా ఆదాయం లేక రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates